సింగిల్ ఛార్జింగుతో 261 కి.మీ మైలేజీ. దేశంలో ఇలాంటి ఈవీ మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళితే. అల్ట్రావయెలెట్ స్టార్టప్ కంపెనీ తయారు చేసిన ఈవీ స్కూటర్ రికార్డు అమ్మకాలు నమోదు చేసింది.టెసెరాక్ట్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన స్కూటర్ 48 గంటల్లోనే 20 వేల బుకింగ్స్ జరిగాయి.మొదటి పదివేల మంది వినియోగదారులకు లక్షా 10 వేలకే బండి అందిస్తామని కంపెనీ ఫ్రీ బుకింగ్స్ ప్రారంభించింది. 48 గంటల్లోనే 20 వేల బుకింగ్స్ రావడంతో కంపెనీ ఆఫర్ పొడిగించింది. కేవలం రూ.999తో ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు.
కేవలం 2.9 సెకన్లలోనే టెసెరాక్ట్ 80 కి.మీ వేగం అందుకుంటుంది. 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఇవ్వడంతో వినియోగదారులు ఎగబడుతున్నారు.ఇందులో 6కేవీడబ్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇంది 20 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.