ఓ బ్యాంకులో సిబ్బంది అంతా మహిళా ఉద్యోగులే ఉన్నారు. మహిళలకు పూర్తి అధికారం, గౌరవం దక్కాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ని వరంగల్ NIT సమీపంలోని HDFC బ్రాంచిలో అందరూ మహిళా ఉద్యోగులే ఉండటం విశేషం. 2022 నవంబరు 6న ఈ బ్రాంచిని ప్రారంభించారు.
బ్యాంకులోని వివిధ సెక్షనల్లో పనిచేసే సిబ్బందితో పాటు హౌస్ కీపింగ్ చేసేవారు కూడా మహిళలే. బ్రాంచ్ హెడ్ అపర్ణలక్ష్మి సహా ఆరుగురు ఉద్యోగినులతో ప్రారంభమైన ఈ బ్యాంకు తక్కువ సమయంలోనే రూ.30 కోట్ల టర్నోవర్ సాధించింది. రుణాల మంజూరు, రికవరీలో ఈ బ్రాంచికి మంచి గుర్తింపు ఉంది.