తన ప్రాణాలకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ వీడియో సందేశం విడుదల చేశారు. మధ్యంతర బెయిల్ కోసం తప్పుడు సర్టిఫికెట్లు హైకోర్టుకు సమర్పించాడని అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. తప్పుడు పత్రాలు కోర్టుకు సమర్పించిన కేసులో పోలీసులు బోరుగడ్డ కోసం వెతుకుతున్న సమయంలో ఆయన విడుదల చేసిన వీడియో వైరల్ అయింది.
తన తల్లి ఆరోగ్యం బాగా లేదని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని బోరుగడ్డ అనిల్ (borugaddaanilkumar#9) వీడియోలో చెప్పారు. తనకు, తన భార్యకు, పిల్లలకు, తన తల్లికి ఎలాంటి హాని జరిగినా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని బోరుగడ్డ హెచ్చరించారు. కోర్టులపై తనకు విశ్వాసం ఉందన్నారు.