బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ విచారిస్తోంది. ఆ విచారణ సమయంలో నటి ఒంటిమీద గాయాలున్నట్లు తమకు తెలిసిందని కోర్టుకు తెలియజేసింది. అయితే ఆ గాయాలు చాలా కాలం నుంచే ఉన్నాయని రన్యా రావు వెల్లడించింది. దాంతో కోర్టు ఆమెకు అవసరమైన వైద్య సహకారం అందించమని ఆదేశించింది.
మరోవైపు, విచారణకు రన్యా రావు సహకరించడం లేదని డిఆర్ఐ విభాగం కోర్టుకు తెలియజేసింది. రన్యారావును విచారించడానికి ఆమెను మూడు రోజుల పాటు డిఆర్ఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ కేసులో బెయిల్ కోసం రన్య పెట్టుకున్న పిటిషన్‌ను జడ్జి ఇప్పటికే తిరస్కరించారు.