ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్ ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు…అరకు కాఫీ మరో స్టార్ బక్స్ కావాలని ఆకాంక్షించారు. మహిళల ఆదాయం ఆర్జన కోసం గతంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం గతంలో హైదరాబాద్‌లో35 ఎకరాలు కేటాయించిన విషయాన్ని ప్రస్తావించారు. మహిళలు పారిశ్రామికంగా ఎదిగేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
మర్కాపురం పర్యటనలో భాగంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను చంద్రబాబు చంద్రబాబు, తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం ఓ పట్టుచీర కొన్నారు. మహిళా వ్యాపారి చీర ధర రూ.26,400 అని చెప్పగా బేరమాడిన చంద్రబాబు రూ.25 వేలకు కొనుగోలు చేశారు.
పర్యటనలో భాగంగా అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని చంద్రబాబు ధరించారు. పోలీసు శాఖ కోసం రూపొందించిన ‘శక్తి యాప్’ను ప్రారంభించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో ఆదాయం లభిస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు.