ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ ఎంఓయూ చేసుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో రూ.1700 కోట్ల ఖర్చుతో సోలార్ సెల్ ఫ్లాంట్ పెట్టేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ ముందుకు వచ్చింది. ఈ ప్లాంట్ ఏడాదితో ఉత్పత్తి ప్రారంభించనుంది. దీని ద్వారా 4 వేల మందికి ప్రత్యక్షగా ఉద్యోగాలు కల్పిస్తారు. కృష్ణపట్నం పోర్టు నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుని దేశీయంగా సోలార్ సెల్స్ తయారు చేయనున్నారు.
ప్రీమియర్ ఎనర్జీస్ ఇప్పటికే తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టింది. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశీయంగానే సోలార్ సెల్స్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.