ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణాసంస్థ(APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ప్రయాణం చేయవచ్చు.
పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 6.49 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 3,450 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.