ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైంది. ఈ నెల 6 నుంచి మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ జరగాల్సిన పరీక్ష ప్రశ్నాపత్రం అరగంట ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. డెల్టా ప్రాంతానికి చెందిన ఓ కాలేజీ నుంచి ప్రశ్నాపత్రం లీకైనట్లు అనుమానిస్తున్నారు.
ప్రశ్నాపత్రం లీకుపై యానివర్సీటీ పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య సుబ్బారావు స్పందించేందుకు నిరాకరించారు. పేపర్ సీడీ అరగంట ముందు విడుదల చేశామని, అది ఎలా లీకు అయిందో ఇంకా తెలియదన్నారు. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నత అధికారులు దృష్టి సారించారు.