ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు దేశ వ్యాప్తంగా లక్షా 76 వేల కేంద్రాలను ప్రారంభించారు. తాజాగా ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరంలో ఆయుష్మాన్ మందిర్‌ను ప్రారంభించారు.
అందరికీ ఉచిత, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అందించే లక్ష్యంతో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను ప్రారంభించారు. ఆరోగ్య మందిరాలు ఆరోగ్య సంరక్షణకు నిదర్శనంగా నిలిచాయని పురందేశ్వరి చెప్పారు. దేశవ్యాప్తంగా 1.76 లక్షలకు పైగా ఆరోగ్య మందిరాలు ఇప్పుడు పనిచేస్తున్నాయి. వార్షిక సందర్శకుల సంఖ్య 2019-20లో 13.49 కోట్ల నుండి 2023-24 నాటికి 121.03 కోట్లకు పెరిగిందని పురందేశ్వరి గుర్తుచేశారు.