ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఉగాది నుంచి పట్టాలెక్కనుంది. అయితే ఏ జిల్లా మహిళకు ఆ జిల్లాకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానం చెప్పారు.
ఉచిత బస్సు పథకం అమలు చేస్తోన్న రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు, రవాణా మంత్రి ఓ నివేదిక తయారు చేసినట్లు చెప్పారు. పథకం సజావుగా సాగాలంటే కొన్ని నిబంధనలు తప్పవని మంత్రి చెప్పారు. ప్రతి మహిళకు జిల్లా పరిధిలో ఉగాది నుంచి ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తుందని మంత్రి గుర్తుచేశారు.