జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో దూషించిన కేసులో బెయిల్‌పై ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్‌కు మరో వివాదం చుట్టుకుంది. బెయిల్ కోసం తల్లికి అనారోగ్యంగా ఉందని, ఆపరేషన్ చేయించాలంటూ గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పేరుతో నకిలీ సర్టిఫికెట్ పొంది హైకోర్టుకు సమర్పించారు. బెయిల్ కేసు విచారణ సమయంలోనే పీపీ అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా బోరుగడ్డ హైకోర్టుకు సమర్పించిన సర్టిఫికెట్ ఫేక్ అని తేలడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అనంతపురం పోలీసులు నమోదు చేసిన కేసులో రాజమండ్రి జైలు నుంచి గత నెల 15న విడుదలైన బోరుగడ్డ, ఈ నెల 11న మరలా జైలులో సరెండర్ అవ్వాల్సి ఉంది. ఈ లోగా ఈ వ్యవహారం బయటపడటంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.