కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఏడాదిలో 30 సార్లు దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ ద్వారా తీసుకువచ్చిన రన్యారావు, అమెరికా, ఐరోపా దేశాలకు కూడా తరచుగా ప్రయాణం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
గత వారం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును సిబ్బంది అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వద్ద నుంచి 12 కోట్ల విలువైన 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రన్యారావుకు అండగా ఓ రాజకీయ నేత ఉన్నట్లు తెలుస్తోంది. తరచూ అవే దుస్తుల్లో రన్యారావు ప్రయాణాలు చేయడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి, పరిశీలించగా బంగారం స్మగ్లింగ్ #goldsmuggling వ్యవహారం వెలుగుచూసింది. రన్యారావు అమెరికా, ఐరాపా దేశాల నుంచి కూడా భారీగా బంగారం తీసుకువచ్చినట్లు తేలింది. ఒక్కో రౌండుకు ఆమె రూ.12 లక్షలు వసూలు చేస్తారని విచారణలో గుర్తించారు.