ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ పన్నిన కుట్రను… పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం, ఆ రాష్ట్ర పోలీసులూ భగ్నం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసారు. వారి నుంచి గ్లాక్ 9ఎంఎం పిస్టోల్, పీఎక్స్5 స్ట్రామ్ పిస్టోల్, లోకల్ మేడ్ 30 బోర్ గన్, 32 బోర్ గన్, కొన్ని మ్యాగజైన్లు, తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను జగ్‌రూప్ సింగ్ అలియాస్ జగ్గా, సుఖ్‌జిత్ సింగ్ అలియాస్ సుక్కా, నవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ నవ్ అని గుర్తించారు. వారిపై అమృతసర్‌లో కేసు నమోదు చేసారు. ఈ నిందితులకు హ్యాండ్లర్… అమెరికా నుంచి కార్యకలాపాలు సాగించే గురుప్రీత్ సింగ్ అలియాస్ గోపీ నౌషహరియా అని తెలిసింది. గురుప్రీత్‌కు పాకిస్తాన్ నుంచి పనిచేసే ఖలిస్తానీ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.