అమెరికాలో విమానంలో ప్రయాణిస్తోన్న ఓ మహిళ చేసిన వింత చేష్టలు ప్రయాణీకులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. హ్యూస్టన్ పోలీసులు అందించిన సమాచారం మేరకు…
హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళుతోన్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ కాగానే ప్రయాణీకురాలు బట్టలు విప్పేసి కాక్‌పిట్ వద్ద డోరు తెరిచేందుకు ప్రయత్నం చేసినట్లు సిబ్బంది వెల్లడించారు. 25 నిమిషాలపాటు విమానంలో బట్టలు విప్పి అటూ ఇటూ పరుగులు తీస్తూ రచ్చ చేసిందని ప్రయాణీలు వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ ఘటనతో విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని అత్యవసరంగా దించారు. ఆమె ఒంటిపై దుప్పటి కప్పి, పోలీసులకు అప్పగించారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని అనుమానిస్తున్నారు.