ప్రఖ్యాత అంతరిక్ష పరిశోధనా ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ తాజాగా నిర్వహించిన స్టార్ షిప్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. అమెరికా టెక్సాస్‌లోని బొకాచికా కేంద్రం నుంచి గురువారం సాయంత్రం ప్రయోగించిన రాకెట్ కాసేపటికే పేలిపోయింది. ఈ వీడియో వైరల్ అయింది. రాకెట్ పేలి తారాజువ్వల్లా దూసుకొచ్చిన శకలాలు అరేబియా సముద్రంతోపాటు, ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లో పడ్డాయి.
స్పేస్ ఎక్స్ జనవరిలో నిర్వహించిన ప్రయోగం కూడా విఫలమైంది. అయితే ప్రయోగం విఫలం కావడానికి సాంకేతిక కారణాలే కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాకెట్ విఫలమైనా బూస్టర్ మాత్రం సురక్షితంగా బొకాచికా కేంద్రం చేరుకుంది.