మొదటి భాగం తరువాయి:
హలాల్‌కు రాజ్యాంగ రక్షణ:
భారతదేశ పౌరుల్లో ఒక పెద్ద సముదాయానికి (అంటే ముస్లిములకు) హలాల్ అనేది తప్పనిసరిగా పాటించాల్సిన మతవిశ్వాసమని, దానికి రాజ్యాంగంలోని 25, 26 అధికరణల కింద రక్షణ ఉందనీ ట్రస్ట్ వాదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో కూడా హలాల్ సర్టిఫికేషన్ అవసరమని స్పష్టం చేసింది.
‘‘హలాల్ సర్టిఫికేషన్ చాలావరకూ వినియోగదారులను బట్టి ఉంటుంది. హలాల్ సర్టిఫికెట్ కావాలా వద్దా అని నిర్ధారించుకునే ప్రక్రియలో సర్టిఫికెట్ జారీ చేసే సంస్థకు (అంటే తమకు) ఎలాంటి పాత్రా ఉండదు. హలాల్ సర్టిఫికెట్ తీసుకోవాలా వద్దా అనేది ఆయా ఉత్పాదక సంస్థలు తమ వినియోగదారులను బట్టి తీసుకునే వ్యాపార నిర్ణయం మాత్రమే. కొన్ని ఉత్పత్తులను తప్పకుండా వాడాలి అనుకునే వినియోగదారులు అలాంటి సర్టిఫికెట్ ఉండాల్సిందే అని కోరుకుంటారు’’ అంటూ హలాల్ సర్టిఫికెట్ జారీలో తమకు ఏ అవసరమూ లేదన్నట్లు తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఏమిటీ హలాల్? ట్రస్ట్ వాదన ఏమిటి?:
హలాల్ ట్రస్ట్ చేసిన వాదన అర్ధం ఏమిటో గమనిస్తే… ముస్లిములు తాము వాడే వస్తువులన్నీ హలాల్ అయి ఉండాలని కోరుకుంటారు. అందువల్ల వాటిని తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికెట్ కావాలని కోరుకుంటాయి. అందువల్ల వాళ్ళే తమంత తాము హలాల్ ట్రస్ట్ దగ్గరకు వెడతారు. వారికి వాణిజ్య లబ్ధి కోసం మాత్రమే హలాల్ సర్టిఫికెట్ జారీ చేస్తారు, అంతే తప్ప పాపం హలాల్ ట్రస్ట్‌కు అందులో ఎలాంటి లాభాపేక్షా లేదు. వారు కోట్లు వసూలు చేసి మూటలు కట్టుకోవడం లేదు.
మామూలుగా అందరికీ తెలిసిన హలాల్ ఏమిటి? ముస్లిములు భుజించే మాంసాహార పదార్ధాలను తయారుచేసే ముందు, అక్కడ జంతుహింస జరుగుతుంది కాబట్టి, వారి దైవమైన అల్లాకు అర్పణ చేయడాన్నే హలాల్ అంటారు. అంటే కోడినో, మేకనో కోసే ముందు హలాల్ చేస్తారు. మరి ఈ వస్తువులకు హలాల్ సర్టిఫికేషన్ ఏమిటి? ఎగుమతి చేసే వస్తువులకే హలాల్ సర్టిఫికెట్ అంటూనే… దేశంలో తయారయ్యే ప్రతీ వస్తువుకూ హలాల్ సర్టిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు? దేశంలో ప్రతీ వ్యాపార ఉత్పాదనకూ ముస్లిముల హలాల్ ఆమోదముద్ర ఎందుకు తప్పడం లేదు? ఈ ప్రశ్నలకు జమియాత్ ఉలేమా ఎ హింద్ హలాల్ ట్రస్ట్ నేరుగా జవాబులు ఇవ్వదు. వారి వ్యాపార అవసరాల కోసం తమ దగ్గర ముద్ర వేయించుకుంటున్నారు అని మాత్రమే చెబుతుంది.
హలాల్ సర్టిఫికెట్ పేరిట నిజానికి ఏం జరుగుతోంది?
దేశంలో ఉన్న ముస్లిములు అందరికీ హలాల్ సర్టిఫికెట్ ఉన్న వస్తువులను మాత్రమే వాడాలన్న సందేశం ప్రచ్ఛన్న పద్ధతుల్లో వెడుతుంది. ఇక ముస్లిం దేశాలు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకు హలాల్ కావాలని అడుగుతాయో లేవో కానీ, వాటి పేరు మీద ఇక్కడ ప్రతీ వస్తువునూ హలాల్ చేసేస్తున్నారు.
పైగా, ఇక్కడ ఆ పదార్ధాలను హలాల్ చేయడం అనే ఆధిభౌతిక ప్రక్రియ ఏదీ జరగదు. అంటే, కోడిని కోసేటప్పుడు వాళ్ళ అల్లాని తలచుకున్నట్లు ఇక్కడ వస్తువులను తయారుచేసే దశలో అల్లాకు అర్పించే పద్ధతి ఏమీ ఉండదు. అంటే మౌలికంగా హలాల్ కాన్సెప్ట్‌కే మనుగడ లేదు. అయినా, డబ్బులు తీసేసుకుని హలాల్ చేసాం అని ఒక కాగితం ముక్క మీద రాసి చేతిలో పెడతారు, అంతే. ఇస్లాంలో పెళ్ళి కూడా కాంట్రాక్టే కదా. అందుకే ‘నిఖా హలాలా’ పద్ధతి కూడా ఉంది కదా. పెళ్ళి చేసుకునే అమ్మాయినే హలాలా చేసే మతంలో, వస్తువులను హలాల్ చేయడం ఒక లెక్కా?
(సశేషం)