ఇరాన్‌లో హిజాబ్ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. 2023లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడిన సింగర్‌కు కోర్టు శిక్ష విధించింది. 74 కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది.
2022లో ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది. ఆ సమయంలో హిజాబ్‌కు వ్యతిరేకంగా పాటలు పాడిన మొహదీ యర్రాహిపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో అతడిని కోర్టు దోషిగా విడుదల చేసింది. అయితే ఇటీవల రివల్యూషనరీ కోర్టు అతనికి 74 కొరడాదెబ్బలు కొట్టాలని తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై యర్రాహి స్పందించారు. స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించడానికి ఇష్టపడని వ్యక్తి స్వేచ్ఛకు అర్హుడు కాదంటూ వ్యాఖ్యానించాడు.
1979 ఇస్లామిక్ విప్లవం సమయం నుంచి ఇరాన్‌లో మహిళలు ధరించే దుస్తులపై నిబంధనలు ఏర్పాటు చేశారు. మహిళలు తప్పనిసరిగా నిబంధనల మేరకు దుస్తులు ధరించాలి. 2022లో మాసా అమి అనే మహిళ హిజాబ్‌ను సరిగా ధరించలేదనే నెపంతో ఆమెను జైల్లో తీవ్ర హింసకు గురించేశారు. ఆమె జైలులోనే ప్రాణాలు కోల్పోయింది. మాసా అమి ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆమె ఉద్యమానికి భారీగా మద్దతు లభించిన సంగతి తెలిసిందే.