వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ పోలీసులు విచారించారు. అత్యాచారానికి గురైన బాధిన బాలిక పేరును చట్టానికి విరుద్దంగా బయటపెట్టిన కేసులో ఎంపీ మాధవ్‌పై గత ఏడాది నవంబరు 2న విజయవాడలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు విచారణకు రావాలంటూ గత వారమే నోటీసులు అందించారు. బుధవారంనాడు గోరంట్ల మాధవ్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను గురువారం నాడు హాజరు అవుతానంటూ పోలీసులకు మాధవ్ సమాచారం అందించారు. ఇవాళ విజయవాడ సైబర్ క్రైం పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ తరవాత పోలీసులు గోరంట్ల మాధవ్‌కు మరో నోటీసు అందించారు. కేసులో సాక్ష్యాలు చెరపరాదని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు అందించారు.