దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వర్మ బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. దాన్ని ఇవాళ విచారించిన హైకోర్టు ఆరు వారాల పాటు కేసు విచారణపై స్టే విధించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.
2019లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా సమాజంలో కులాల మధ్య వైషమ్యాలు రగిల్చేలా ఉందని, ఆయన సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేసాడనీ ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటి ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసారు. ఆ కేసును కొట్టేయాలంటూ వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసారు.