మాజీ మంత్రి, వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకానందరెడ్డి హత్య సమయంలో ఆయన ఇంటికి వాచ్‌మెన్‌గా రంగయ్య పనిచేశారు. వివేకానందరెడ్డి హత్య సమయంలో విధుల్లో ఉన్న రంగయ్యన ఈ కేసులో ప్రధాన సాక్షిగా సీబీఐ చేర్చింది. ఆయనకు ప్రాణహాని ఉండటంతో పోలీసుల రక్షణ కూడా కల్పించారు.
రంగయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల కిందట జారిపడటంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. రెండు రోజుల కిందట ఊపిరి ఆడటం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ఆయన మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణంపై అనుమానాలున్నాయని రంగన్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.