ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఛావా సినిమా తెలుగు అనువాదం మార్చి 7న విడుదల కానుంది. అయితే ఆ చిత్రం విడుదలను నిలువరించాలంటూ కొందరు ముస్లిములు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రబోధించే ఛావా చలనచిత్రం దేశవ్యాప్తంగా చక్కటి ఆదరణ దక్కించుకుంది. చాలాకాలం తర్వాత హిందీ చిత్రపరిశ్రమకు మంచి విజయం లభించింది. దాంతో ఆ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన ఛావా సినిమా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఆ సినిమాపై జాతీయవాద వ్యతిరేకులు మండిపడుతున్నారు.
ఛావా సినిమా తెలుగు వెర్షన్ విడుదలను ఆపేయాలంటూ ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సంస్థ పేరిట కొంతమంది ముస్లిములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసారు. ఆ సినిమాలో ఔరంగజేబును దుష్టుడిగా చూపించడంపై దేశవ్యాప్తంగా పలువురు ముస్లిములు మండిపడుతున్నారు. శంభాజీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
నిజానికి జాతి వ్యతిరేక ప్రచారంతో కూడుకున్న తప్పుడు చరిత్ర చిత్రాలు విడుదలైనప్పుడు సోకాల్డ్ మేధావులంతా వాటిని ఈ దేశపు నిజమైన చరిత్ర అంటూ ప్రచారం చేసారు. అలాంటివాటిని హిట్ చేయడం సమాజం బాధ్యత అంటూ ఊదరగొట్టారు. మొగలే ఆజం, అనార్కలి, తాజ్‌మహల్, జోధా అక్బర్ వంటి చిత్రాలను కళాఖండాలు అంటూ ఆదరించి దేశం నెత్తిన రుద్దారు. మన దేశ ప్రజలకు జరిగిన అన్యాయాలను చరిత్రకెక్కించాలి అనే ఉద్దేశంతో తీసిన కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి చిత్రాలను మాత్రం ముస్లిములకు వ్యతిరేకం, వివాదాస్పదం అంటూ తప్పుడు ప్రచారం సాగించారు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఛావా సినిమా మీద కూడా దుష్ప్రచారం జరుగుతోంది.
అసలు, దుష్టుడైన ఔరంగజేబును జాతీయవాది అయిన శంభాజీ అనే రాజు ఎదుర్కొంటే వారికి ఎందుకు నొప్పి కలుగుతోంది? అందులో మతం ప్రసక్తి ఏముంది? ఐదారు తరాల క్రితం ఈ దేశంలో ముస్లిం అన్నవాడే లేడు కదా. ఇప్పుడున్న ముస్లిములు అందరూ ఏదో ఒక రూపంలో మతం మారినవారే కదా. వారిని ఇప్పటికిప్పుడు ఎవరూ తమ మతం వదిలిపెట్టి రమ్మని అడగడం లేదు. ఒక దుష్టుడైన రాజుకు, మరో మంచివాడైన రాజుకు మధ్య జరిగిన ఘర్షణగానే చూడవచ్చు కదా. హిందువులను విలన్లుగా ఉద్దేశపూర్వకంగా చూపించే వందల సినిమాలను కేవలం సినిమాలుగా చూడాలి అని వాదించేవారు, ఈ చిత్రాన్నీ అదే దృక్కోణంతో ఎందుకు చూడడం లేదు? ఔరంగజేబును తమ మతానికి ప్రతినిధిగా చూస్తున్నారు ఎందుకు? అందుకే, ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.
ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదు వల్ల ఆ సినిమా విడుదల ఆగుతుందా? అన్నది ఇంకొక్క రోజులో తేలిపోతుంది.