ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు పరుగులు తీయించేందుకు, వాటి పనులను నిత్యం పర్యవేక్షించేందుకు సీఎం అధ్యక్షత మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ లక్ష్య సాధనలో భాగంగా ఈ గ్రూపు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంలోనూ ఇలాంటి గ్రూపు పనిచేస్తోంది.
రాష్ట్రంలో రూ.50 కోట్లు, అంతకు మించిన ప్రాజెక్టులను ఈ గ్రూపు పర్యవేక్షిస్తుంది. అడ్డంకులను తొలగిస్తుంది. ఈ గ్రూపునకు సీఎం అధ్యక్షునిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులుగా ఉంటారు. వివిధ శాఖ కార్యదర్శులను గ్రూపులో సభ్యులుగా చేర్చారు.