రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరతెలంగాణ జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క అంజిరెడ్డి, ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కూటమి అభ్యర్థులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కూటమికి, బీజేపీకి అండగా నిలిచిన కార్యకర్తల త్యాగాలను కొనియాడారు.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల గెలుపుపై సీఎం చంద్రబాబునాయుడు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్‌కు ప్రధాని రీట్వీట్ చేశారు. ఏపీ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని చెప్పారు.