పవిత్ర పుణ్యస్థలం అమర్నాథ్ యాత్రకు తేదీలను ప్రకటించారు. జులై 3 నుంచి అమర్నాథ్ యాత్రకు అనుమతించాలని నిర్ణయించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, అమర్నాథ్ దేవాలయ కమిటీతో చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు.
హిమాలయపర్వతాల్లో సముద్రమట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ యాత్రకు ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అనుకూలమైన వాతావరణం రాగానే కమిటీ యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది. ముందుగా భక్తులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. యాత్రీకులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరవాత మాత్రమే అనుమతిస్తారు. కేంద్ర ప్రభుత్వం యాత్రీకులకు దారిపొడవునా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తుంది. జులై 3న ప్రారంభమయ్యే యాత్ర ఆగస్ట్ 9 వరకు కొనసాగుతుంది.