అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హమాస్ ఉగ్రసంస్థను హెచ్చరించారు. హమాస్ చెరలో ఉన్న బందీలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ మొదటి ఒప్పందం గత శనివారంతో ముగిసింది. దాన్ని కొనసాగించాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.
హమాస్ చెరలో ఒప్పటికే 90 మంది బందీలున్నారు. ఇజ్రాయెల్ వద్ద పాలస్తీనా ఖైదీలు 1700 మంది ఉన్నారు. హమాస్ చెరలోని బందీలను విడుదల చేస్తే, ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అయినా హమాస్ ఉగ్రసంస్థ సమ్మతించలేదు. దీంతో పాలస్తీనాకు వెళ్లే మానవతాసాయాన్ని ఇజ్రాయెల్ అడ్డుకుంది. దీన్ని పలు దేశాలు ఖండించాయి.
హమాస్ ఉగ్రవాదులు బందీలను వెంటనే విడుదల చేయకుంటే ఇజ్రాయెల్‌కు మరింత సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. పాలస్తీనా పౌరులు పశ్చిమాసియాలోని ఏదైనా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ట్రంప్ సూచించారు. అయితే ట్రంప్ సూచనలను ఇరాన్, జోర్డాన్ తీవ్రంగా ఖండించాయి.