కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో చర్చలు ముగించుకుని బయటకు వచ్చిన జైశంకర్ వద్దకు ఖలిస్థాన్ మద్దతుదారులు నినాదాలతో దూసుకువచ్చారు. దీంతో లండన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వారిని తరిమి కొట్టారు. ఈ వీడియో వైరల్ అయింది. భద్రతా వైఫల్యంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
మార్చి 4 నుంచి 9వ తేదీ వరకు విదేశాంగ మంత్రి జైశంకర్ లండన్ పర్యటనకు వెళ్లారు. బ్రిటన్ విదేశాంగ మంత్రితో ప్రపంచంలో భారతదేశ వృద్ధి పాత్ర అనే అంశంపై చర్చలు జరిగాయి.చర్చలు మొదటి రోజు ముగించుకుని ఛాఠమ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన జైశంకర్‌కు అనుకోని ఘటన ఎదురైంది. ఖలిస్థాన్ మద్దతుదారులు భారత జాతీయ జెండా పట్టుకుని అవమానించే విధంగా నినాదాలు చేస్తూ జైశంకర్ కారు వద్దకు దూసుకొచ్చారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది వారిని తరిమి కొట్టారు.