సెమీఫైనల్ 2 లో దక్షిణాఫ్రికా పై న్యూజీలాండ్ విజయం
భారత్ తో ఫైనల్ ఆడనున్న సెమీ ఫైనల్ 2 విజేత కివీస్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజీలాండ్ విజయం సాధించింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో కివీస్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో విజయంసాధించింది. మార్చి 9న భారత్, న్యూజీలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. సెమీ ఫైనల్ 1 లో భాగంగా ఆసీస్ ను ఓడించిన భారత్, ఫైనల్ కు అర్హత సాధించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 362 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ 21 పరుగులు చేయగా ఔట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర, 101 బంతుల్లో 108 పరుగులు చేయగా విలియమ్సన్ 102 పరుగులు చేశాడు. డారియరిల్ మిచెల్ (49 ) గ్లెన్ ఫిలిప్స్ ( 49 )పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు వికెట్లు తీయగా , కగిసో రబాడా రెండు , వియాన్ ముల్డర్ ఒక వికెట్ తీశారు.
కివీస్ విధించిన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించలేకపోయింది. సఫారీలు 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 312 పరుగులు చేయగల్గారు.
డేవిడ్ మిల్లర్ అజేయ శతకం ఆ జట్టు విజయానికి దోహదపడేలేదు. డేవిడ్ మిల్లర్ 67 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. రియాన్ రికల్టన్(17 ), టీమ్ బావుమా( 56), రస్సీ వాన్ డెర్ డుస్సేన్(69), మారక్రమ్ ( 31) పరుగులు చేశారు. హెన్రిచ్ క్లాసిన్(3), ముల్డర్ (8), మార్కో జాన్సన్ (3), కేశవ్ మహరాజ్(1), కసిగో రబాడా(16) విఫలమయ్యారు. లుంగి ఎంగిడి (1*) నాటౌట్ గా మిగిలిపోయాడు.
కివీస్ బౌలర్లలో హెన్రీ రెండు, బ్రాస్ వెల్ ఒకటి, మిచైల్ స్టాంతర్ మూడు, రచిన్ రవీంద్ర ఒకటి, గ్లెన్ ఫిలిఫ్స్ 2 వికెట్లు పడగొట్టారు.