ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ‘కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ’ అంటూ పవన్ హోదా గురించి మాట్లాడారు. తాడేపల్లి లో
మీడియాతో మాట్లాడిన జగన్, ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీని అసెంబ్లీ స్పీకర్,ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమిగా ఉన్నప్పుడు వైసీపీ ఒక్కటే అసెంబ్లీలో విపక్షంగా ఉందన్నారు.
గతంలో చంద్రబాబుకు తమ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చిందన్నారు. దిల్లీలో గతంలో బీజేపీ
మూడు స్థానాలున్నా ప్రతిపక్ష హోదా దక్కిందన్నారు. గతంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ఎంతసేపైనా మాట్లాడే అవకాశం ఇచ్చామన్నారు. విపక్షానికి సమయమిస్తేనే ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించిన జగన్, శ్రీకాకుళంలో ప్రభుత్వానికి ఉపాధ్యాయులు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. అక్కడ రిగ్గింగ్ సాధ్యం కాదు అన్నారు.