ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
నామినేషన్ దాఖలు చేయాలని జనసేనాని ఆదేశం
జనసేన నేత నాగబాబు, ఎమ్మెల్సీ గా పోటీ చేయనున్నారు. కూటమి తరఫున ఆయన నామినేషన్ దాఖలుచేయనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి పార్టీ సమాచారమిచ్చింది. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు, రాజ్యసభ సభ్యత్వం, కార్పొరేషన్ చైర్మన్ అంటూ రకరకాల వార్తలు బయటకొచ్చాయి. టీటీడీ చైర్మన్ పదవి అంటూ కూడా గతంలో ప్రచారం జరగగా దానిని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రిమండలిలోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై కూటమి తరఫు నుంచి అధికారిక ప్రకటన వెలువాడాల్సి ఉంది.