ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపాడు. మార్చి 18, 19, 20 తేదీల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
‘రాజకీయనేతలకు రిలీఫ్ ఉండాలన్న సభాపతి అయ్యన్పపాత్రుడు , పురుషుల విభాగంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలు ఉన్నాయన్నారు. మహిళా ఎమ్మెల్యేలకు బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నీ కాయిట్, టగ్ ఆఫ్ వార్, వంద మీటర్ల పరుగు పందెం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రతిభావంతులకు 20న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందన్నారు. సభాపతి నిర్ణయంపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.