తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వద్దకు విద్యార్థులుఉదయం 8 గంటలకే చేరుకోవడంతో ఆయా చోట్ల సందడి వాతావరణం నెలకొంది.
హాల్‌టికెట్ తోపాటు పూర్తిగా తనిఖీ చేసన తర్వాతే అనుమతిస్తున్నారు. విద్యార్థులు గరిష్ఠంగా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ప్రింటెడ్ మెటీరియల్ పై పరీక్షా కేంద్రాల వద్ద నిషేధం విధించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ చర్యలు ఉంటాయని విద్యాశాఖ హెచ్చరించింది.
కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు రాష్ట్రంలోని 1532 పరీక్షా కేంద్రాలను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు నుసంధానం చేశారు.ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4,88,448 మంది, సెకండియర్ (రెగ్యులర్) విద్యార్థులు 4,40,788 మంది,
సెకండియర్ (ప్రైవేట్) విద్యార్థులు 67,735 పరీక్షలకు హాజరుకానున్నారు. మొత్తం విద్యార్థులు 9,96,971 మంది ఉండగా అందులో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు 1,42,245 మంది ఉన్నారు.