ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు అందజేశారు. ప్రైవేటు పాఠశాలల వేధింపులకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి ఫీజు చెల్లింపు పేరిట పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను వద్దే పెట్టుకుని వేధింపులకు దిగుతున్నట్టు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.
ప్రభుత్వం ఇప్పుడు వాట్సాప్ ద్వారా నేరుగా విద్యార్థులకే హాల్ టికెట్లు పంపింది. దీంతో వారు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.ఇంటర్ విద్యార్థులు కూడా ఇదే తరహాలో హాల్ టికెట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 9552300009 వాట్సాప్ గవర్నెన్స్ సాయంతో ఈ సదుపాయం పొందవచ్చు.
ప్రభుత్వ బడుల్లో ‘యాక్టివ్ ఆంధ్ర’
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను క్రీడల్లోనూ తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ దృష్టిపెట్టింది. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని అమలుచేయనుంది. దిల్లీ పాఠశాలల్లో అమలు చేసిన నమూనాపై అధికారులు కసరత్తు చేశారు. వేసవి సెలవుల వరకు ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు హైస్కూల్ లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బడుల్లో విద్యార్థులను 5 నుంచి8, 9 నుంచి14, 15 నుంచి19 ఏళ్లుగా విభజిస్తారు. గ్రూపుల వారిగా వారికి ఆసక్తి ఉన్న ఆటలను రోజుకో గంట చొప్పున ఆడిస్తారు.