ప్రముఖ గాయని కల్పన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను గుర్తించిన పోలీసులు ఆమెను నిన్న సాయంత్రం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.
కల్పన హైదరాబాద్ కేపీహెచ్‌బీలో ఒక విల్లాలో ఉంటున్నారు. ఆమె భర్త చెన్నైలో ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయనకు కల్పన ఫోన్ చేసి నిద్రమాత్రలు మింగినట్లు చెప్పారు. దాంతో ఆయన స్థానికులకు సమాచారం ఇచ్చారు. కాలనీ సంఘం ప్రతినిధులు పోలీసులను సంప్రదించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్ళారు. అప్పటికే స్పృహ తప్పిన కల్పనను దగ్గరలో ఉన్న హోలిస్టిక్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు.
కల్పన ఆత్మహత్యా ప్రయత్నం చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి కారణాలు తెలియరాలేదు. మరోవైపు తెలుగు సినీ పరిశ్రమలోని గాయనీ గాయకులు పలువురు ఆస్పత్రికి చేరుకున్నారు. కల్పన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.