మార్చి 9న ఫైనల్ లో టైటిల్ పోరు
ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ 1 లో ఆసీస్ పై భారత్ విజయం సాధించింది. మార్చి 9న జరిగే ఫైనల్ లో టైటిల్ కోసం తలపడనుంది.
దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన అన్ని విభాగాల్లోనూ ఆసీస్ పై పేచేయి సాధించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పాండ్యా బ్యాటింగ్ తో అదరగొట్టారు. అభిమానులు ఏమాత్రం నిరాశకు గురికాకుండా ఆడి విజయాన్ని అందుకున్నారు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 బంతుల్లో 264 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్యఛేదనలో భారత్ ఏ మాత్రం అశ్రద్ధ చూపలేదు. 48.1 ఓవర్లో ఆరు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసి ఫైనల్ లో అడుగుపెట్టింది. 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సెమీ ఫైనల్- 2 లో కివీస్, సౌతాఫ్రికా తలపడతాయి. గెలిచిన జట్టుతో భారత్, మార్చి 9న దుబాయ్ వేదికగా ఫైనల్ ఆడనుంది.
ఆసీస్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ స్టీవ్ స్మిత్( 73), అలెక్స్ కేరీ (61) పరుగులు చేయగా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (39), లబుషేన్ (29) పరుగులు చేయగా మ్యాక్స్ వెల్ (7), జోష్ ఇంగ్లిస్ (11) లు భారత బౌలర్ల ముందు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా , వరుణ్ చక్రవర్తి , రవీంద్ర జడేజా చెరో రెండు తమ ఖాాతాలో వేసుకున్నారు. , హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

భారత్ ఇన్నింగ్స్ లో కోహ్లీ (84) టాప్ స్కోరర్ గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. శ్రేయస్ అయ్యర్(45) మరోసారి జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ( 28), అక్షర్ పటేల్ (27) తమ వంతు భాగస్వామ్యాన్ని అందించారు. శుభమన్ (8)ఈ మ్యాచ్ లో విఫలం అయ్యాడు. , హార్దిక్ పాండ్యా ( 28) బ్యాటింగ్ మెరుపులు మెరిపించాడు. కేఎల్ రాహుల్) 42 నాటౌట్)మరోసారి సిక్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా , ఎల్లిస్ చెరో రెండు వికెట్లు తీశారు. బెన్ డ్వార్షూయిస్ , కూపర్ కనోలీకి చెరొక వికెట్ దక్కింది.