ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారి వయోపరిమితిని పెంచింది. ప్రస్తుతం ఉన్న వయోపరిమితి కంటే యూనిఫామ్ ఉద్యోగాలకు రెండేళ్లు ,నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లోపు జరిగే నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వయో పరిమితి పెంపు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నియామకాలకు వర్తించనుంది.