తిరుమల అలపిరి మెట్ల మార్గం సహా పలుచోట్ల చిరుత సంచారం కలకలం రేపుతోంది. రెండేళ్ల కిందట ఓ చిన్నారిని చిరుత ఎత్తుకెళ్లి చంపేసింది. దీంతో కొండపైకి నడకమార్గాన వెళ్లే వారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.సోమవారం అర్ధరాత్రి తర్వాత కూడా అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించింది.అక్కడ ఉన్న ఓ పిల్లిని వేటాడి నోటకరిచి అడవిలోకి వెళ్ళింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
తిరుపతిలోని జూ పార్క్ రోడ్డులోనూ చిరుతపులి సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి పదిగంటల తర్వాత నడక మార్గాల్లో భక్తులను అనుమతించడంలేదు. సుమారు 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల లోపే నడక మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.