ప్రైవేటు రంగంలో యుద్ధ విమానాల తయారీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తేజస్ యుద్ధ విమానాల ఉత్పత్తి ఆలస్యం కావడంపై వాయుసేన అధినేత అమర్ ప్రీత్ సింగ్ గత కొంత కాలంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రైవేటు రంగంలో యుద్ధ విమానాల తయారీని దశల వారీగా ప్రోత్సహించాలని రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఆదేశించారు.
తేజస్ యుద్ధ విమానాల తయారీని వేగవంతం చేసేందుకు డిఫెన్స్ ఎంపవర్‌మెంట్ కమిటీ కీలక సూచనలు చేసింది. అమెరికా నుంచి తేజస్ యుద్ధ విమానాలకు చెందిన ఇంజన్లు రావడం ఆలస్యం కావడంతో వాటి ఉత్పత్తి నిలిచిపోయింది. రాబోయే 20 సంవత్సరాల్లో 350 తేజస్ యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యుద్ధ విమానాల తయారీ ఆలస్యం కావడంతో వాయుసేనలో తీవ్ర కొరత ఏర్పడింది. తేజస్ అవసరం చాలా ఉందని వాయుసేన అధినేత అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. తయారీ ఆలస్యం కావడంతో స్క్వాడ్రన్ల సంఖ్య పడిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.