విశాఖ రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ తొలగింపుతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. బాధ్యులైన ఇద్దరు అధికారులపై బదిలీ వేటు వేసింది. వెంటనే పరిశుభ్రతకు చర్యలు చేపట్టింది. శాశ్వత పద్దతిలో రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ పోస్ట్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. కుక్కలను తరలించే ఏర్పాట్లు చేశారు.
బ్లూఫ్లాగ్ తొలగించడానికి దారితీసిన పరిస్థితులను తీసుకువచ్చిన జి.వేణిపై వేటు వేశారు. ఆమె స్థానంలో డి.దాసును నియమించారు. బ్లూఫ్లాగ్ గుర్తింపునకు కావాల్సిన ప్రమాణాలు వెంటనే పునరుద్ధిరించాలని ఆదేశించారు. విశాఖతీరంలో మంచి గుర్తింపు పొందిన రుషికొండ బీచ్నకు బ్లూఫ్లాగ్ తొలగించడంతో రాష్ట్రప్రభుత్వ పరువు పోయినట్లైంది. దీంతో వెంటనే అధికారులు చర్యలకు ఉపక్రమించారు.