దుబాయ్ వేదికగా మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆరోసారి సెమీస్ కు చేరిన భారత్
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఆస్ట్రేలియా2.30గంటలకు మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ ఆరోసారి సెమీఫైనల్‌కు చేరింది. ఐదుసార్లు సెమీస్ ఆడిన భారత్, నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 1998లో ఒకసారి మాత్రం వెస్టిండీస్ చేతిలో ఓడింది.
భారత్ చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఆడి బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. ఫైనల్ పాకిస్తాన్ తో చేతిలో ఓడింది. 2002, 2013 లో భారత్ ఛాంపియ్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో సెమీఫైనల్స్‌లో భాగంగా భారత్, 2000, 2002, 2013, 2017లో విజయం సాధించింది.