సర్పంచ్ హత్య కేసులో ఆరోపణలు
సీఎం ఫడ్నవీస్ ఆదేశాలతో మంత్రి పదవికి రాజీనామా చేసిన ధనంజయ్
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ మొండే మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనంజయ్ ను రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశించారు. ఆయన ఇప్పటివరకు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వం బాధ్యతలు నిర్వర్తించారు.
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలక నేతగా ధనంజయ్ ఉన్నారు. సొంత జిల్లా బీడ్‌లో మసాజోగ్ గ్రామ సర్పంచి సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఎన్సీపీ (శరద్ పవార్) ముఖ్యనేత సుప్రియా సూలే కూడా ధనంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో ధనంజయ్ పాత్రపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు సామాజిక కార్యకర్త ఆధారాలు అందజేశారు.