డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె
తాగిన మైకంలో తనను దూషించిన డ్రైవర్‌పై అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రపుల్ల కుమార్ మహంత కుమార్తె చెప్పుతో దేహశుద్ధి చేసింది. డ్రైవర్ మద్యం మత్తులో దూషించాడంటూ అతనిని చెప్పుతో కొడుతూ విరుచుకుపడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.ఈ ఘటన ప్రభుత్వ ఎమ్మెల్యే కార్టర్స్‌లో చోటు చేసుకుంది.
డ్రైవర్ తనవద్ద చాలాకాలంగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. గత కొంత కాలంగా మద్యం మత్తులో దూషిస్తూ, వేధిస్తున్నాడని బాధితురాలు చెప్పారు.అతనికి ఉన్న సమస్యల వల్ల సహనంతో కొంత కాలం భరించినట్లు ఆమె చెప్పారు. అయినా అతనిలో మార్పురాలేదన్నారు.
తను ఇంట్లో ఉండగా బయటకు రావాలంటూ తలుపులు గట్టిగా కొడుతూ దూషించాడని ఆమె వాపోయారు. అందుకే అతడికి తగిన బుద్ధి చెప్పినట్లు తెలిపారు. డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగా, ప్రైవేటుగా నియమించుకున్నారా అనే విషయం తేలాల్సి ఉంది.