ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఒక సీటు గెలుచుకోగా, మరోచోట ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. చివరి రౌండ్ ముగిసే సమయానికి ఆలపాటికి 82320 ఓట్ల మెజారిటీ లభించింది. సమీప అభ్యర్థి లక్షణరావుపై ఆయన విజయం సాధించారు.
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులనాయుడు విజయం సాధించారు. మేజిక్ ఫిగర్ 10068 కాగా, ఆయనకు 12035 ఓట్లు వచ్చాయి. ఆయన గెలుపును అధికారులు ప్రకటించారు. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రాజశేఖరం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాసేపట్లో తుది ఫలితం రానుంది.