అయోధ్యలో ఇటీవలే నిర్మించిన బాలరాముడి మందిరం మీద దాడి చేయాలని పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) ప్రయత్నించిందని తెలుస్తోంది. ఆ దాడి ప్రయత్నాన్ని భారతదేశపు భద్రతా సంస్థలు సమర్థంగా అడ్డుకున్నాయని సమాచారం. దాడి చేయడానికి ప్రయత్నించిన అబ్దుల్ రెహమాన్ అనే అనుమానితుణ్ణి హర్యానాలోని ఫరీదాబాద్‌లో అరెస్ట్ చేసారు.
అనుమానితుడి దగ్గర రెండు గ్రెనేడ్లు దొరికాయి. అతణ్ణి దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. కేంద్ర సంస్థలు, హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సహకారంతో గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ విచారణ జరుపుతోందని సమాచారం.
అరెస్ట్ అయిన అనుమానితుడు అబ్దుల్ రెహమాన్‌కు పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. ఐఎస్ఐయే అతనికి శిక్షణ ఇచ్చిందని సమాచారం. అయోధ్య రామాలయంపై దాడి చేయడానికి అతని ప్రయాణానికి తగిన ఏర్పాట్లు అన్నీ ఐఎస్ఐ చేయించిందని తెలుస్తోంది. బాలరాముyaa, డి గుడిని పేల్చేయడం కోసం అబ్దుల్ రెహమాన్ ముందు రెక్కీ కూడా నిర్వహించాడని సమాచారం.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత