మొగల్ చక్రవర్తి ఔరంగజేబు దాష్టీకాల్లో ఒక చీకటి అధ్యాయాన్ని బైటపెట్టిన ‘ఛావా’ సినిమా తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమైంది. తెలుగు ఛావా మార్చి 7న విడుదల కానుంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఛావా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చలనచిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లు వసూలు చేసింది. భారతీయులు ఉన్న ప్రతీ దేశంలోనూ గొప్ప ఆదరణ సాధిస్తోంది.
ఛావా సినిమా కలెక్షన్ల సంగతి పక్కన పెడితే నిజమైన దేశ చరిత్రను బైటకు తీసుకువచ్చింది. దాంతో వామపక్షవాదులు, ఉదారవాదులకు ఇబ్బందికరంగా మారింది. ఔరంగజేబును సమర్ధిస్తూ ఇన్నాళ్ళూ చేసుకుంటూ వచ్చిన ప్రచారం అబద్ధమని తేలిపోవడంతో వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగులో వస్తుంటే మరింత మంది సామాన్య ప్రజలకు నిజమైన చరిత్ర తెలిసొస్తుందన్న ఆవేదన వారిని నిలవనీయకుండా చేస్తోంది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత