త్వరలో 16347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ విడుదల చేస్తామని విద్యా మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ప్రకటించారు. కొందరు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16వేలకుపైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
పాఠశాలల్లో మౌలికసదుపాయాల అభివృద్ధికి రూ.3 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతి పాఠశాలకు ప్రహరీ గోడలు నిర్మిస్తామని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికివందనం పథకం ద్వారా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కూడా సహాయం అందిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
విద్యా విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయని మంత్రి తెలిపారు. విద్యార్థుల డేటా తల్లిదండ్రుల ఫోన్లో చూసుకునే విధంగా యాప్ సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలు ఎన్ని గంటలకు పాఠశాలకు వెళ్లారు. పరీక్షల్లో మార్కులు ఎన్ని వచ్చాయి. పాఠశాల నుంచి బయటకు ఎన్ని గంటలకు వెళ్లారు లాంటి సమాచారం మొత్తం…వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత