తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వింత ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. పెళ్లైన జంటలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సాధ్యమైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. 2026లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో తగ్గిన జనాభా వల్ల 8 సీట్లు కోల్పోయే ప్రమాద ముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడులో సీట్లు తగ్గుకుండా ఉండాలంటే పెళ్లైన జంటలు వెంటనే పిల్లల్ని కనాలని సీఎం స్టాలిన్ సూచించారు. ఇటీవల ఓ వివాహానికి హాజరైన స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో వివాహం చేసుకున్న తరవాత, డబ్బు బాగా సంపాదించిన తరవాత ఒక్కరితో సరిపెట్టుకుని ఆనందంగా జీవించాలని కోరుకునే వారిమని గుర్తుచేశారు. ఆరోజుల్లో జనాభాను తగ్గించాలని తాను కూడా ప్రచారం చేసినట్లు చెప్పారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో జనాభాను పెంచాలని ఆయన సలహా ఇచ్చారు.
జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను 2026లో పునర్విభజన చేయాలని కేంద్రం సంకల్పించింది. దీని వల్ల జనాభా నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై 40 పార్టీల అధినేతలతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత