అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడుల వరద పారించింది. ఐదు క్రిప్టోకరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచుతుందని ట్రంప్ చేసిన ప్రకటనతో రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బిట్‌కాయిన్, ఎథర్ సహా మొత్తం ఐదు క్రిప్టోకరెన్సీలను రిజర్వులుగా ఉంచాలంటూ ప్రెసిడెన్సియన్ గ్రూప్‌ను ఆదేశించారు.
అమెరికా ఎన్నికల ముందు నుంచి ట్రంప్ క్రిప్టోకరెన్సీలకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చాక క్రిప్టోకరెన్సీని ప్రోత్సహిస్తామంటూ హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ప్రకటనలతోపాటు చర్యలకు ఉపక్రమించారు.
ట్రంప్ తాజా ప్రకటనతో క్రిప్టోకరెన్సీల విలువ ఒకే రోజు 10శాతంపైగా పెరిగాయి. బిట్‌కాయిన్,ఎథర్ క్రిపోకరెన్సీలు దూసుకెళ్లాయి. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినతరవాత పరుగులు తీసిన క్రిప్టోకరెన్సీలు గత నెలలో కొంత దిద్దుబాటుకు గురయ్యాయి. తాజాగా ట్రంప్ నిర్ణయంతో బిట్ కాయన్ మరోసారి లక్ష డాలర్లను దాటే దిశగా పరుగులు పెడుతోంది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత