అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో వాగ్వాదానికి దిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఓ మెట్టు దిగివచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు తాము సిద్దమేనని ప్రకటించారు. ట్రంప్ మరోసారి చర్చలకు ఆహ్వానిస్తే వెల్లడానికి సిద్దమేన్నారు. ఐరోపా దేశాల ప్రతినిధులతో ఆయన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఐరోపా తనకు మద్దతుగా నిలిచిందని, ఆ విషయం మరోసారి స్పష్టమైందన్నారు.
ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాలు తవ్వుకునేందుకు తమకు అనుమతివ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన డిమాండుకు జెలెన్‌స్కీ అంగీకరించారు. దీనిపై గురువారం జరిగిన చర్చల్లో రష్యా దాడుల నుంచి తమను రక్షించాలంటూ జెలెన్‌స్కీ డిమాండుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మాకు యుద్ధం వద్దు, దీర్ఘకాలం శాంతి కావాలంటూ ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత