వైసీపీ కీలక నేత, నటుడు పోసాని కృష్ణమురళిని ముందుగా తమకు అప్పగించాలంటూ నరసరావుపేట పోలీసులు,రాజంపేట జైలు అధికారులకు పిటీ వారెంట్ అందించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన పోసాని మొత్తం 17 కేసులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నారు.
పోసాని కృష్ణమురళిని తమకు ముందు అప్పగించాలంటే… లేదు తమకు ముందు అప్పగించాలని పోలీసులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కోర్టు అనుమతితో వచ్చామని నరసరావుపేట పోలీసులు జైలు అధికారులకు చెప్పారు. వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అనంతపురం, అల్లూరి జిల్లా పోలీసులు కూడా పిటీ వారెంటులతో వచ్చారు.
పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంలో నిబంధనలు పరిశీలించడంతోపాటు, ఉన్నత అధికారుల సలహాలు తీసుకుంటున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత