సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆస్కార్ అవార్డుల ప్రధానం అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీతో ఆకట్టుకున్న అనోరాకు అవార్డుల పంట పండింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. ది బ్రూటలిస్ట్‌లో నటనకు అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు.
అనోరాలో మైకీ మ్యాడిస్ నటనకు ఉత్తమ నటిగా సీన్ బేకర్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఎ రియల్ పెయిన్ చిత్రానికి కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా, ఎమిలియా పెరెజ్ చిత్రంలో జోయాకు ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ అందించారు.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన డ్యూన్ పార్ట్ 2 చిత్రం ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు గెలుచుకుంది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ నుంచి నామినేట్ అయిన అనూజ చిత్రం నిరాశ పరిచింది. ఐయామ్ నాట్ ఏ రోబో ఉత్తమ లఘు చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ డాల్బీ థియేటర్‌లో వైభవంగా జరిగిన 97 అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ప్రముఖులు, టెక్నీషియన్లు హాజరయ్యారు. నటీనటులు ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త ట్రెండీ దుస్తులను పరిచయం చేశారు. ఈ పోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత